
దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సుందర్ కుమార్
ప్రజాశక్తి - పాలకోడేరు
మణిపూర్‌లో గిరిజన క్రైస్తవులపై జరుగుతున్న హంసాకాండను కేంద్ర ప్రభుత్వం వెంటనే అదుపు చేసి గిరిజన, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కుముదవల్లిలో కాల్మన్‌పేటలో దళిత ఐక్య వేదిక ఆధ్యర్యంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరకుమార్ మాట్లాడుతూ మణిపూర్ ఘటనలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ సంఘటనపై రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకుని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పాలపర్తి జోన, సుందర్‌సింగ్, గల్లి సత్యానందం, యాకోబు, దొడ్డి, దానియేల్, ఆనంద్ కుమార్ మహిళలు పాల్గొన్నారు.