ప్రజాశక్తి - మార్టూరు రూరల్ : మణిపూర్‌లో ఆదివాసులు,క్రైస్తవులుపై హిందూ మతోన్మాద శక్తులు 70 రోజులుగా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయని సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల హనుమంతరావు తెలిపారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి, అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధిత మహిళలు ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడి పోలీసులు కేసు నమోదు చేయకపోవడం బిజెపి ప్రభుత్వ వైఫల్యమ మన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మణిపూర్ అల్లరి మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చీవాట్లు పెట్టినట్లు తెలిపారు. దీంతో గత్యంతరం లేక కేంద్ర ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసి శిక్షిస్తామని ప్రకటిం చినట్లు తెలిపారు. 400 పైగా చర్జీలను కూల్చినట్లు తెలిపారు. వేలమందిని గాయపరిచి 150 మందిని హత్య చేసినట్లు తెలిపారు. మణిపూర్‌లో నరమేధం జరుప ుతుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకూ ప్రధాన మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే అక్కడి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఓట్ల రాజకీయాలు, మతాలను, కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే బిజెపి చర్యలను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన డిమాండఠ్ చేశారు. అనంతరం మహిళలతో కలిసి మానవహారం నిర్వహించారు.చిన్నగంజాం : మణిపూర్‌లో మహిళలపై జరిగిన అమానుష చర్యలను ఖండిస్తూ సిఐటియు ఆధ్యర్యంలో అంబేద్కర్ సెంటర్‌లో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా కార్యదర్శి గున్నమనేని ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి గ్రామంలో ఊరేగించడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై అఘాయిత్యాన్ని పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న మారణహోమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలని కోరారు. మణిపూర్ అల్లర్లతో అట్టడుగుతుంటే ప్రధాని మోడీ చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యాకోబు , జకరయ్య, వెంకటేశ్వర్లు సూర్య చంద్రప్రకాష్, పుల్లారావు కరిముల్లా, మస్తాన్, రిక్షా యూనియన్ కార్మికులు, పాల్గొన్నారు. బాపట్ల : ప్రధాని మోడీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని బాపట్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గుదే రాజారావు తెలిపారు. మణిపూర్ ఘటనను ఖండిస్తూ పాత బస్టాండ్ సెంటర్‌లో ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ భారత్ బచావో బేటి బచావో( భారతదేశాన్ని కాపాడుకుందాం ఆడపిల్లలను రక్షించుకుందాం) అని నినాదం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలకు అనుసరిస్తున్న విధానాలకు పొంతనలేదన్నారు. మణిపూర్ ఘటన భారత మాతపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. మణిపూర్ ఘటనకు ప్రధానమంత్రి, హోం మంత్రి అమిషా, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాగిత కోటేశ్వరావు , కొచ్చర్ల వినరు రాజు, సిపిఎం కార్యదర్శి కష్ణ మోహన్ , జెబి. శ్రీధర్ , గిరిజన నాయకులు దేవరకొండ రాము , మహిళా నాయకురాలు దాసరి లక్ష్మి, దాసరి ఏసుబాబు, ఏపూరి జోసఫ్ , సంజీవరావు తదితరులు పాల్గొన్నారు










