Jul 29,2023 23:08

మణిపూర్‌ సంఘటనపై నిరసనలు

ప్రజాశక్తి -యంత్రాంగం కరప అంబేడ్కర్‌ యువజన సేవా సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాణిపూర్‌ రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడికి నిరసనగా కరపలో ర్యాలీ నిర్వహించారు. పిహెచ్‌సి ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి సంఘం అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు, వేళంగి గ్రామ సర్పంచ్‌ సవిలే నీలిమరాజేష్‌, ఆశా వర్కర్స్‌ సంఘం నాయకులు రెడ్డి వెంకటలక్ష్మి, దళిత నాయకులు సాదే లోహిదాస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం వద్ద నుండి కరప పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐ, తహశీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు సవిలే రాజేష్‌ మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడి, యావత్తు దేశంపై జరిగిన దాడి అన్నారు. స్త్రీలను నగంగా ఊరేగించడం ఏ దేశ సంస్కతి అని ఆయన ప్రశ్నించారు. పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు ఎం.రాజ్‌ కుమార్‌, మూరా అవినాష్‌, మాతా అప్పారావు, సాధనాల పద్మావతి, సాదే వీర రాఘవులు, రొక్కాల నూకరాజు, మారేళ్ళ వెంకట రమణ, పులపకుర శుభమహేశ్వరరావు, వింత సురేష్‌, దాలిపర్తి శ్రీనివాసరావు, ఉబా ఏడుకొండలు, యలమంచిలి సుకుమార్‌, చాట్రా శ్రీనివాస్‌, యూత్‌ గుబ్బల రామకష్ణ, మారేళ్ళ సిద్ధూ, పోట్లకాయల నానిబాబు, గుత్తాల ధ్రువకుమార్‌ పాల్గొన్నారు.
కోటనందూరు మణిపూర్‌లో హత్యలు, మహిళలపై మానభంగాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని తొండంగి, పాయకరావుపేట, తుని, నక్కపల్లి, కోటనందూరు మండలాలకు చెందిన వేలాది మంది క్రైస్తవులు, ప్రజా సంఘాల నాయకులు, తుని గొల్ల అప్పారావు సెంటర్‌ నుంచి చర్చి సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఆరుగుల మోషే, నాసా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నూతలపాటి సోనీ వుడ్‌ పాల్గొన్నారు.