ప్రజాశక్తి-అరకులోయ:మణిపూర్‌లో ఆదివాసీ మహిళలపై ఆత్యాచారం, మరణ హౌమం అరికట్టడంలో విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని అరకులోయలో ఆదివారం ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు.మణిపూర్ ఆదివాసీ మహిళలపై జరుగుతున్న మారణహౌమంపై రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవాని డిమాండ్ చేశారు. అక్కడి ఆదివాసీ మహిళలపై బిజేపి, ఆర్‌ఎస్‌ఎస్ సహకారంతో జరుగుతున్న మరణ హౌమాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘం అద్యర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. మహిళల పై సామూహిక అత్యాచారంకు పాల్పడిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, ఆదివాసీ మహిళల పై సామూహికంగా ఆత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించి, వెంటనే శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేశారు. మహిళలను నగంగా రోడ్డుపై ఊరేగిస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ మాట్లాడుతూ, మణిపూర్ ఘటలనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఈ ఘటనపై బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి స్పందించక పోవడం బాధాకరమన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా ఆదివాసులపై దాడులు, దౌర్జన్యాలు అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పి. రామన్న, అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మహిళ సంఘం నాయకులు వివి జయ, నేరనిరోధక సంఘం నాయకులు కృష్ణకుమారి, ఎపిటిఫ్ నాయకులు ఈశ్వరరావు, పిఆర్‌టియు నాయకులు సూర్యప్రకాష్, దండకారణ్య సంఘం నాయకులు ప్రసన్న, ఏపీఎస్ వ్యవస్థాపకుడు చట్టు మోహన్, యుటిఎఫ్ జిల్లా నాయకులు రఘునాథ్, చిట్టిబాబు,నారాయణ, మోహన్,బాలకష్ణ, సీఐటీయూ నాయకులు సింహాద్రి, ఆదివాసి కాఫీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సుంకరమెట్ట పంచాయతీ సర్పంచ్ జి. చిన్నబాబు, ట్రైబల్ జర్నలిస్ట్ పాడేరు డివిజన్ ప్రధాన కార్యదర్శి డి.గోవర్ధన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎస్. ఐసుబాబు, ఆదివాసి మాతభాష సంఘం నాయకులు ఎస్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పాడేరు:మణిపూర్ రాష్ట్రంలోని గిరిజన మహిళలపై అఘాయిత్యాలు అల్లర్ల వెనుక బిజెపి హస్తం ఉందని ఆదివాసి గిరిజన సంఘం అల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ విమర్శించారు ఆదివారం గిరిజన సంఘం కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసి గిరిజన సంఘం, ఆదివాసి మహిళా సంఘం ఆధ్వర్యాన చింతపల్లిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ,. మణిపూర్ రాష్ట్రం తగలబడుతున్నా కేంద్రం చూస్తుంది తప్ప కనీసం స్పందించలేదని మండిపడ్డారు. ఈ అఘాయిత్యాలపై రాష్ట్రపతి నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పాంగి జీవన్ కృష్ణ, మండల నాయకులు కొర్ర కార్తీక్, ఆదివాసి గిరిజన మహిళా సంఘం పి రత్నం, లక్ష్మి పాల్గొన్నారు.
మణిపూర్ ఘటన అమానుషం
అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం
పాడేరు టౌన్: మణిపూర్ ఘటన అమానుషం, చాలా బాధాకరం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇరలాంటి ఘటనలు పునారావతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం ఎఎస్‌ఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముఖి శేషాద్రి, బి.సింహాచలం అన్నారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అల్లూరి జిల్లా సర్వసభ్య సమావేశం పాడేరు గిరిజన భవన్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన దుర్ఘటన యావత్ భారతావనికే సిగ్గుచేటన్నారు. మణిపూర్ ఘటనల కారకులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా శాఖ ఏర్పాటు సంవత్సర కాలం పూర్తయినందున సంఘం చేపట్టిన కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ యుపి పాఠశాలలను అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా, మండల కార్యవర్గంలో ఖాళీ స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పిం చారు. ఈ సమావేశంలో నాయకులు రామకష్ణ, కూడా సింహాద్రి, కిల్లు రామ్మూర్తి నాయుడు, ఎస్. పూర్ణచందర్రావు, ఈశ్వర రావు, అనిల్ కుమార్, సూర్యనారాయణ, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎపి ఆదివాసి వికాస్ పరిషత్
పాడేరుటౌన్:మణిపూర్‌లో ఆదివాసీలపై దాడులను, మహిళలపై పాశవిక చర్యలను ఎపి ఆదివాసి వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు అడపా బొంజునాయుడు తీవ్రంగా ఖండించారు. ఎపి ఆదివాసి వికాస్ పరిషత్ అల్లూరి జిల్లా కార్యవర్గ సమావేశం పాడేరు గిరిజన భవన్ లో ఆదివారం జరిగింది. ఆగస్టు 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఆదివాసి ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించాలన్నారు. ఆదివాసీల హక్కులు, చట్టాలు సక్రమంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతంలో గిరిజనేతరుల చొరబాట్లు అరికట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చింతపల్లి మండలం అన్నవరంలో నిర్వహించుటకు తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పరిషత్ నాయకులు నాగంనాయుడు, విలియమ్, కోడ సింహాద్రి, బూడిదే చిట్టిబాబు, ముత్యాలమ్మ, లక్ష్మి, కొండమ్మ, సావిత్రి, రమణమ్మ, ఊర్వసి రాణి, తదితరులు పాల్గొన్నారు.










