ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
ప్రజాశక్తి - మక్కువ : మణిపూర్‌లో మహిళలపై దాడులు నిలిపివేసి వెంటనే ఆ రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించేలా కేంద్రం నిర్ణయం చేయాలని సిఐటియు నాయకులు జి.కృష్ణ, ఎల్.దాలమ్మ డిమాండ్ చేశారు. మణిపూర్ సంఘటనలను నిరసిస్తూ గురువారం అంగన్‌వాడీలు నిరసన చేపట్టారు. దేశంలో మహిళలపై ప్రత్యేకించి మణిపూర్‌లో కుకితెగ గిరిజన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా, శాంతిభద్రలు అదుపు చేయలేని విధంగా అక్కడ సిఎం వ్యవహరించారని విమర్శించారు. వెంటనే మణిపూర్‌లో శాంతిభద్రతలు చేయాలని, మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై.పద్మ, ఆర్.పోలమ్మ, పి.పద్మ తదితరులు పాల్గొన్నారు.










