Jul 21,2023 23:44

కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న శ్రామిక మహిళలు

ప్రజాశక్తి - కాకినాడ
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ప్రధానమంత్రి మోడీ చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ, సిఐటియు ఆధ్వర్యంలో కచేరిపేట అంబేద్కర్‌ విగ్రహంవద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ జి.బేబిరాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌ మాట్లాడారు. మూడు నెలల నుంచి మణిపూర లో మైతే, కుకి తెగలమధ్య మొదలైన హింసకాండవల్ల 150 మంది హత్యకు గురయ్యా రన్నారు. ప్రతి రోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. అనేకమంది కుకి తెగకు సంబంధించిన గిరిజనుల గృహాలను తగలబెట్టా రన్నారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా ప్రధాని మోడీ కనీసంగా స్పందించకపోవడం చూస్తే మణిపూర్లో జరుగుతున్న హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలున్నాయనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. తక్షణం మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. మే నెలలో జరిగిన వీడియో బయటకు వచ్చిన తరువాత మాత్రమే రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారని, కార్గిల్‌ అమరవీరుడి భార్యను వీడియోలో చూపినట్లుగా వివస్త్రను చేసి, అత్యాచారం అనంతరం హత్యచేసిన ఘటనకు భారతదేశం తలదించుకునేలా ఉందన్నారు. దీనికి మోడి సిగ్గుపడాలన్నారు. ఇలా బయటకు రాకుండా జరిగిన అనేక అఘాయిత్యాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గిరిజన ప్రాంతాలపై మైత్రి తెగ ప్రజలకు హక్కుని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం నేడు మత కలహాలుగా మారి చర్చిలు తగలబెడుతూ, క్రిస్టియన్‌ ఫాస్టర్లను చంపుతున్నారన్నారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం బిజెపి హిందుత్వ ఎజెండాలో భాగంగానే జరుగుతుంద న్నారు. గిరిజనుల భూములను మైత్రి ప్రజలకు ఇవ్వాలనే సాకుతో విలువైన ఖనిజాలు కలిగిన కొండ ప్రాంతాలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలనే కుట్ర దాగి ఉందని, కాబట్టే కేంద్రం ప్రభుత్వం హింసాకాండను అరికట్టేం దుకు ఏ ప్రయత్నమూ చేయలేదన్నారు. మానవ త్వంలేని ప్రధానిగా మోడీ చరిత్రలో మిగిలిపో తారని విమర్శించారు. తక్షణం అల్లర్లకు పాల్పడే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుని మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. మేధావులు, ప్రజాస్వామికవాదులు, దేశ సమైక్యతను కోరుకునేవారు తక్షణం మోడీ చర్యలను ఖండించాలని, లేకపోతే మణిపూర్‌ ప్రయోగం దేశవ్యాప్తంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అమలు చేస్తుందని హెచ్చరించారు.