Aug 17,2023 00:17

నిరసన ర్యాలీ చేస్తున్న కార్మికులు, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- సబ్బవరం
మణిపూర్‌ మారణకాండను నిరసిస్తూ సిపిఎం మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి ఆధ్వర్యంలో స్థానిక దుర్గమాంబ ముఠా కలాసీ సంఘం కార్యాలయం నుండి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో గత మూడు నెలలుగా సాగుతున్న నరమేదాన్ని, దానికి కారకులైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించాలన్నారు. దాడులకు పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని, బాధితులందరికీ పునరావాసం, రక్షణ వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం 5, 6 షెడ్యూల్‌లో ఉన్న ప్రాంతలన్నింటిపైన అక్కడి గిరిజనులకు గల అన్ని హక్కులు పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గమాంబ ముఠా కలాసీ సంఘ అధ్యక్షులు బర్ల రమణ, పలువురు కార్మికులు పాల్గొన్నారు.