Aug 04,2023 00:33

ప్రజాశక్తి-కాకినాడ మణిపూర్‌ మారణకాండకు నిరసనగా కాకినాడ భానుగుడి సెంటర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, దళిత ఉద్యమ సీనియర్‌ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు తదితరులు మాట్లాడారు. మణిపూర్‌లో ఆదివాసీలు, మహిళలపై జరిగిన మారణకాండ, అత్యాచారాలు ప్రపంచం ముందు భారతదేశం తలవంచుకునేలా చేశాయన్నారు. మణిపూర్‌ ఘటనలకు కేంద్ర, మణిపూర్‌ రాష్ట్ర పాలకులైన బిజెపి నేతలే బాధ్యత వహించాలన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన దారుణాలను అరికట్టకుండా, ఇంటర్నెట్‌ బంద్‌ చేసారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుందన్నారు. ఘటన జరిగిన 78 రోజుల తర్వాత ప్రధాని స్పందన చూస్తుంటే అధికార పక్ష అండతోనే దాడులు జరి గాయనే అనుమానం కలుగుతోందన్నారు. విజ్ఞాన వేదిక నాయకులు యు. సత్య నారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, పలివెల వీరబాబు, మలకా వెంకట రమణ, చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకట రమణ, పద్మ, కె.దుర్గాప్రసాద్‌, రామకష్ణ, ఈశ్వరరావు, బివివి. సత్యనారాయణ, దుంపల ప్రసాద్‌, శ్రీహరి, రాణి, పాలిక రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కరణం గారి జంక్షన్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, ఉపాధ్యక్షుడు పి.వరహాలు మాట్లాడారు. టిఎన్‌ఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రాజ్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వరహాలు, ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ నాయకులు రమేష్‌, సురేష్‌, రంజిత్‌, అంకిత, బుజ్జమ్మ, నగర నాయకులు వాసు, ఉమాశంకర్‌, అభిషేక్‌, కృప పాల్గొన్నారు.