Jul 23,2023 21:25

అంబేద్కర్‌ విగ్రహం ఎదుట కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న నాయకులు

మణిపూర్‌ మారణ హోమానికి కేంద్రం బాధ్యత వహించాలి


ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జరుగుతున్న మారణ హోమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్‌ షాలు బాధ్యత వహించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) జిల్లా అధ్యక్షులు యస్‌. దేవ సహాయం పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలో డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహం ఎదుట మణిపూర్‌లో మహిళల అత్యాచారం చేసిన వారిని శిక్షించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర నెలల నుండి కుకీ తెగ (క్రిస్టియన్లు) ప్రజల ప్రాణాలపై, మానా లపై, ఆవాసాలపై, ప్రార్థన స్థలాలపై మెయితీ హంతక మూకలు బహిరంగంగా సాగిస్తున్న హింస కాండకు మతోన్మాద పాలకులు అండగా ఉన్నారని ఆరోపిం చారు. మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో కెవిపియస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కనకవీడు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి సుమాల అంతోనీ, నాయకులు సోగనూరు ఆనంద రావు, మాల నాగప్ప, కలుగొట్ల మాల రాజ రమేష్‌, కోటేకల్లు చిన్నప్ప, వెంకటాపురం గుంటెప్ప, సుమాల రాజు, కె. భాస్కర్‌, యం. రంగన్న తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు: మణిపూర్‌లో మహిళలపై జరిగిన అత్యాచారాలను వ్యతిరేకిస్తూ మాలమహనాడు జిల్లా అధ్యక్షడు మహానంది స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ నందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు హత్తి బెలగల్‌ ఈరన్న, లక్ష్మీనారాయణ, భరత్‌, నగరూరు చంద్ర, మల్లికార్జున, ఎర్రన్న, రాము, చాగి లింగప్ప, బాష, వీరేష్‌, లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.