మణిపూర్ లో గిరిజనులకు రక్షణ కల్పించాలి - ప్రజా సంఘాలు
ప్రజాశక్తి - కొత్తపల్లి
మణిపూర్ రాష్ట్రంలో గిరిజన క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అత్యాచారాల మారణకాండ నుండి గిరిజనులను కాపాడాలని ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పి గిరిజనులకు రక్షణ కల్పించాలని కెవిపిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి యేసురత్నం ఎన్ సంపత్ మాల మహానాడు సీనియర్ నాయకులు గనమల మల్లయ్య పాతకోట రమేష్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఈ రాజు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎన్ స్వాములు ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్ బాబు యాదవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం నాడు కొత్తపల్లి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడి గిరిజనుల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైంది అన్నారు. మణిపూర్ లోని బిజెపి ప్రభుత్వం రెండు గిరిజన తెగల మధ్య చిచ్చుపెట్టి మెజార్టీ వర్గానికి కొమ్ము గాస్తు మైనార్టీ గిరిజనుల పైన దాడులకు ప్రేరేపించిందన్నారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి క్రైస్తవుల చర్చిలపైన ఇళ్ల పైన దాడులకు పులిగొలిపింది అన్నారు. మహిళల లను రాష్ట్ర పోలీసులే అంత ముటాకు అప్పగించి నగ్నంగా రెండు కిలోమీటర్లు ఊరేగించి అత్యాచారం చేస్తే కనీసం హంతకులను అరెస్టు చేయలేదని ఆరోపించారు. గిరిజనుల యొక్క సాగు భూములను అటవీ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు అప్పగించడం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రధానమంత్రి హోంమంత్రి పార్లమెంటులో మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకొని సుమోటో గా కేసును స్వీకరించినప్పటికీ పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడితే మన రాష్ట్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకించడం సరైనది కాదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈ మణిపూర్ మారణకాండపై స్పందించి గిరిజనులకు అండగా నిలవాలని ప్రజలు ప్రజా సంఘాలు పౌర సమాజమంతా మణిపూర్ ప్రజలకు శాంతిని నెలకొల్పేందుకు నైతిక మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల కార్యకర్తలు నక్క జయన్న చిమ్మే శంకర్ అన్నలదాసు ప్రసాద్ శీలం దేవదాసు ఓబులేసు స్వాములు రాజారావు దేవకుమార్ గోపాల్ జి దాసు చిన్న చిన్నయ్య నాయక్ ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.










