గుంటూరు: మణిపూర్‌లో కుకీ, నాగా ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ ప్రగతిశీల కార్మిక సమాఖ్య గుంటూరు నగర కమిటీ ఆధ్వ ర్యంలో స్థానిక నల్లచెరువు కమ్యూనిస్టు బొమ్మల సెంటర్ నుండి హిందూ కాలేజీ సమీపంలోని పూలే విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించి, పూలే విగ్రహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పికెఎస్ నగర కార్యదర్శి ఎన్.పోతురాజు మాట్లాడుతూ మణిపూర్ మారణకాండకు బాధ్యత వహిస్తూ బిజెపి ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, హౌంమంత్రి అమిత్‌షా డైరెక్షనలో సంఘపరివార్ శక్తులు హిందూ మైతీలను రెచ్చగొట్టి, సైన్యం సహకారంతో కుకీ, నాగా ఆదివాసీలపై దాడులకు పాల్పడటమే కాకుండా మహిళలను నగంగా ఊరేగించి ఆపై వారిపై అత్యాచార హత్యలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు.కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు గనిరాజు, కెఎన్‌పిఎస్ జిల్లా కార్యదర్శి కె.నాగేశ్వరరావు, పికెఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










