Jul 31,2023 21:28

ర్యాలీలో పాల్గొన్న ఫాస్టర్లు, క్రైస్తవులు

ప్రజాశక్తి-సాలూరు: మణిపూర్‌ రాష్ట్రంలో హింసకు వ్యతిరేకంగా ఆదివారం పట్టణ ఫెలోషిప్‌ ఫాస్టర్స్‌ ఆధ్వర్యాన క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. మూడు నెలలుగా మణిపూర్‌లో దారుణమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, వాటి నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బోసుబొమ్మ జంక్షన్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్‌ పార్టీ నాయకులు గొంప ప్రకాశరావు, ఫాస్టర్‌ సువార్తరావు, మాజీ కౌన్సిలర్‌ ఎం.అప్పారావు పాల్గొన్నారు.