Jul 31,2023 23:57

మాట్లాడుతున్న కెవిపిఎస్‌ నాయకులు ఎల్‌ జయరాజు


ప్రజాశక్తి-చీరాల
మణిపూర్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తిస్తున్నప్పటికీ రాష్ట్రంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలు స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నాయకులు అన్నారు. మణిపూర్‌ మారణకాండను నిరసిస్తూ సోమవారం స్థానిక ఎన్జీవో కార్యాలయంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు లింగం జయరాజు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్‌లో జరిగిన దుర్మార్గమైన సంఘటనలపై మణిపూర్‌ ముఖ్యమంత్రి, కేంద్ర హౌం, ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయ్యాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ రాష్ట్రశాంతి భద్రతలు కల్పించి రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలని, మణిపూర్‌ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ సమావేశం నిర్వహించారు. సమావేశం తీర్మానం మణిపూర్‌ ప్రజల సంఘీభావ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వహించారు. రాజ్యాంగం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల, మానవ హక్కుల పట్ల, మైనారిటీల మాన ప్రాణాల పట్ల ఇంత చులకన భావం ఉన్న బీజేపికి ఒక రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత ఈ దేశంలో లేదని అన్నారు. కానీ మన రాష్ట్రంలోని అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ విషయం నోరు మెదపకపోవడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. మోడీ దుర్మార్గమైన దారుణమైన విధానాలపై జగన్‌, చంద్రబాబు, పవన్‌ లు మాట్లాడలేనివారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇప్పటికైనా మోడీ మొద్దు నిద్ర వీడి మణిపూర్‌ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించి వారిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు తీర్మానాలను చేశారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌ బాబురావు, వసంతరావు, కొండయ్య, ప్రజా చైతన్య వేదిక గుమ్మడి ఏసురత్నం, దళిత బహుజన ప్రజాసంఘాలు నాయకులు నూకతోటి బాబురావు, దాసరి ఇమ్మానియేలు, మోహన్‌ కుమార్‌ ధర్మా, శీలం వెంకటేశ్వర్లు, కట్టా రాజ్‌ వినరు కుమార్‌, దుడ్డు విజరు సుందర్‌, మణికుమార్‌, జనసేన గూడూరు శివరాం ప్రసాద్‌, కోటి ఆనంద్‌, టి లక్ష్మీప్రసాద్‌, ఎ రామారావు, పావులూరి చిరంజీవి కె రామారావు, జి శ్రీను తదితరులు పాల్గొన్నారు.