Jul 28,2023 23:23

ప్రజాశక్తి - తాళ్లరేవు మణిపూర్‌లో హింసాకాండకు వ్యతిరేకంగా సిఐటియు, ఐద్వా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయం నుంచి మెయిన్‌ రోడ్డుపై చెరువుగట్టు సెంటర్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశీల్దారు కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కమిడి ఈశ్వరీబాయి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పిల్లి వెంకటలక్ష్మి, పద్మజ, సిఐటియు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు అనంతలక్ష్మి, నాగలక్ష్మి, ఎంపిటిసి పోతుల రత్నకుమారి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దుప్పి అదృష్ట దీపుడు, తణుకు రాజు పాల్గొన్నారు. బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, దళిత వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సుంకరపాలెంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వి.చంద్రమౌళి, కాశి లక్ష్మణస్వామి, జక్కల ప్రసాద్‌ బాబు, గుత్తాల శ్రీరాములు మాట్లాడారు.