కడప అర్బన్ : మణిపూర్‌లో కుకీల తెగకు చెందిన గిరిజనులపై మేయితీ వర్గాన్ని ప్రేరేపించి దాడులకు పాల్పడుతున్న సంఫ్‌ు పరివార్ చర్యలకు స్వస్తి పలకకపోతే రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. శనివారం అంబేద్కర్ కూ డలిలో అఖిలపక్ష నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, టిడిపి నాయకుల లక్ష్మిరెడ్డి, జె.వి రమణ, అవ్వారు మల్లికార్జున, డాక్టర్ ఓబుల్ రెడ్డి, బిఎస్‌పి గుర్రప్ప, జెఎసి కన్వీనర్ బాబు బారు, సంఘ సేవకులు సలావుద్దీన్, సంఘటి మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక సంఫ్‌ు పరివార్ తన హిడెన్ ఎజెండా అమలును ముమ్మరం చేసిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో కులం, మతం, దేశభక్తి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ తినే తిండి పైన, కట్టుకునే బట్టల పైన ఆంక్షలు విధిస్తూ ఎస్సీ, ఎస్‌టి, బి సి, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తన పెం పుడు సంస్థలైన అంబానీ, ఆదానీ కంపెనీలకు దోచి పెట్టేందుకు మారణ హోమానికి ఒడి గట్టిందన్నారు. వేలాదిమంది ఆస్తులను కోల్పోయి నిరాశ్రయులు అయ్యారన్నారు. ఊర్లకు ఊర్లు వదిలి అడవిలో తల దాచుకున్న వారిని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి రక్షణ కల్పిస్తామంటూ గిరిజన బిడ్డలను తీసుకువచ్చి సంఫ్‌ు పరీవార్ మూకలకు అప్పజెబితే గిరిజన మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారానికి పాల్పడితే, అడ్డు వచ్చిన వారిని హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదని వాపో యారు. అంబానీ, ఆదానీ ఇళ్లలో చిన్న చిన్న కార్యక్రమాలకు హాజరయ్యే మోడీ 77 రోజులుగా మణిపూర్‌లో మారణహోమం జరుగుతుంటే ఎందుకు దష్టి సారిం చలేదన్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దించి దాడులను అరికట్టి శాంతిభద్రతలను కాపాడలేకపోయిన మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌ను తక్షణం భర్తరఫ్ చేయకుండా మాన ప్రాణాలకు రక్షణ లేకుండా సర్వం కోల్పోయిన కుకీలను పరామర్శించేందుకు వెళ్లినవారిపై కేసులు నమోదు చేసిన ఘనుడు నరేంద్ర మోడీ అన్నారు. ప్రజాస్వామిక వాదులు అందరూ సమైక్యంగా ఉద్యమించి సంఫ్‌ు పరివార్ దుశ్చర్యలను ఎండగట్టాలని, రాబోవు రోజుల్లో బిజెపికి రాజకీయ సమాధి కట్టాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకట శివ, గుంటి వేణుగోపాల్, నాగ సుబ్బారెడ్డి, కె సి బాదుల్లా, బషీర్‌ఉనేసా, సుబ్రహ్మణ్యం, ఓబయ్య, మైనుద్దీన్, మునయ్య సావంత్ సుధాకర్, భాగ్యలక్ష్మి, బ్రహ్మం సుబ్బరాయుడు, సిపిఎం నాయకులు రామ్మోహన్, చంద్రారెడ్డి, అన్వేష్, మక్బూల్ మైనారిటీ నాయకులు, హమీద్, మహిళా సంఘాలు పాల్గొన్నారు.
మోడీ నైతిక బాధ్యత వహించాలి : సలావుద్దీన్
మణిపూర్ రా ష్ట్రంలో సభ్య సమాజం తలదిం చుకునేలా మహి ళలను నగంగా ఊరేగించి, మాన భంగం చేసి చంప ిన అల్లరి మూకలను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని మైనారిటీ నేత, ప్రముఖ సంఘసేవకులు సయ్యద్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రం రావణ కాష్టంలా కాలుతుంటే నరేంద్రమోదీ సారధ్య ంలోని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, కంచే చేను మేసినట్లుగా ఉండటం దుర్మార్గ మన్నారు. సుప్రీంకోర్టు జ్యోక్యం చేసుకొని మణిపూర్ బాధితులకు తక్షణం న్యాయం చేయాలని అల్లరి మూకలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ కిరాతక చర్యలను అరికట్టలేని ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జమ్మలమడుగు రూరల్ : మణిపూర్‌లో మహిళలపై, ఒంగోలులో గిరిజనుడిపై జరిగిన సంఘటనల పై మోడీ, జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ బాధ్యత వహించాలని చర్యలు తీసుకోవాలని సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి వీరనాల శివ నారాయణ తెలిపారు. శనివారం సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివ నారాయణ మాట్లాడుతూ తక్షణమే మాణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. . శ్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ అర్ లక్ష్మీదేవి, మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మత కలహాల సృష్టించి చర్చిలు తగలబెడుతూ, క్రిస్టియన్ ఫాస్టర్లను చంపుతున్నారని, ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం బిజెపి హిందుత్వ ఎజెండాలో భాగమేనని చెప్పారు. తక్షణం మోడీ ప్రభుత్వ మతో న్మాద చర్యలను ఖండించాలని, లేకపోతే మాణిపూర్ ప్రయోగం దేశవ్యాప్తంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అమలుచేస్తుందని హెచ్చ రించారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ రడ్డి, కమాల్ బాషా, సుద్ధపల్లి, బీమా పాల్గొ న్నారు.
ఎంపిజె ఆధ్వర్యంలో..
ప్రొద్దుటూరు: మణిపూర్‌లో మహిళలను నగంగా నడిపించి, తరువాత వారిపై అత్యాచారం చేసిన దుర్మార్గులను నిర్భయ చట్టం కింద కఠినంగా శిక్షించాలని ఎంపిజె (మూవ్‌మెంట్ పీస్ అండ్ జస్టీస్) రాష్ట్ర కార్యదర్శి షేక్‌సలీం అన్నారు. మణిపూర్‌లో అల్లర్ల బాధితులకు సంఘీభావంగా శనివారం సాయంత్రం ఎంపిజె ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఎన్నో రోజులుగా నరమేధం జరుగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని వాపోయారు. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి మణిపూర్‌రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జాకీర్, పట్టణ అధ్యక్షులు హుసేన్‌బాష పాల్గొన్నారు.
కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో..
కడప : దేశ మహిళలకి రక్షణ కల్పించడంలో బిజెపి ఘోరంగా విఫలమయ్యిందని నగర మహిళ అధ్యక్షురాలు లావణ్య ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం యర్రముక్కపల్లి సర్కిల్లో లావణ్య అద్యక్షతన కళ్లకు నల్ల రిబ్బన్ ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మణిపూర్ మహిళల గ్యాంగ్ రేప్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నగర అధ్యక్షులు విష్ణు ప్రీతమ్ రెడ్డి, పుల్లయ్య, శ్రీనివాసులు, కుల్లయ్యప్ప, బాబు, శివ, తిరుమలేశుని, ప్రసాద్, సిద్దు, మహిళ నాయకురాలు మల్లిక, నౌషాద్, పల్లవి,రోజా, గౌషియ, ముంతాజ్, ఫాతిమా, దీప, రమాదేవి, లక్ష్మి దేవి, సుధ, శ్యామలా, అరుణ పాల్గొన్నారు.










