Aug 01,2023 00:49
న్యాయవాదుల నిరసన కార్యక్రమం

ప్రజాశక్తి-బాపట్ల: మణిపూర్‌లో మానవ హక్కులను ఉల్లంఘంచి మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బాపట్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు భీమా లీలా కృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్క రించి కోర్టు ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. భీమా లీలా కృష్ణ మాట్లాడుతూ మణిపూర్‌ సంఘట నపై బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా విజయవాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు న్యాయవాది ఆదిశేషు విఠల్‌బాబు హత్యకు నిరసన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు జడ్‌ బాషా, సి రవికుమార్‌, చలపతిరావు, స్టాలిన్‌, ఇమ్మడిశెట్టి సతీష్‌, ద్వారపల్లి ఫిలిప్‌, యెనుమల భాస్కర్‌గౌడ్‌, సిహెచ్‌ ఆంజనేయులు, దగ్గుమల్లి కిరణ్‌, యలవల నరేష్‌, మహిళా న్యాయవాదులు నాగమోహిని, కత్తి నాగలక్ష్మి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.