Jul 22,2023 21:31

రాయచోటి : నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు

 రాయచోటి టౌన్‌ : మణిపూర్‌లో గిరిజన మహిళలపై జరిగిన దారుణ సంఘటనకు నిరసనగా జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి.భాగ్యలక్ష్మి అంగన్వాడీలతో కలిసి శనివారం నల్లపట్టీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణకై ఎన్ని చట్టాలున్నా ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పోలీసుల సహకారంతో మరిన్ని దాడులు జరుగుతున్నవని ఇలాగైతే స్త్రీలను మ్యూజియంలో చూడాల్సి ఉంటుందని వాపోయారు. మణిపూర్‌ మహిళల మీద దాడి దేశ గౌరవం మీద జరిగినట్లగా భావించి నిందుతులకు కఠిన శిక్ష విధించి భాధితురాలికి న్యాయం జరిగేంతవరకు అన్ని వర్గాల ప్రజలతో కలసి పోరాడతామన్నారు. రాష్ట్రంలో ఉండే 80 శాతం అటవీ ప్రాంతం నుండి కుక్కి తెగకు చెందిన గిరిజనులను తరిమివేసి అటవీ ప్రాంతంలో ఉన్న రకరకాల ఖనిజ సంపదను ఆదాని ,అంబానీలకు కట్ట పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుకీలు మైథిండ్ల మధ్య ఉన్న స్థానిక సమస్యలను ఉపయోగించుకుని మణిపూర్‌ మంటల్లో మాడి పోవడానికి కారణమైందన్నారు. మణిపూర్‌లో ఉన్న కుకీ తెగకు చెందిన గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకే మైదాన ప్రాంత వాసులు అటవీ ప్రాంతంలోని భూములు కొనే అవకాశం లేదని కుకి లకు ఉన్న రిజర్వేషన్‌ లాగా తమకు కూడా కల్పించాలని మైతిండ్లు చేసే డిమాండ్‌ రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పైకి మైథిలిలను ప్రోత్సహించడం దారుణమని వారన్నారు. ఈ రెండు తెగల మధ్య ఉన్న ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసే అవకాశం ఉన్నప్పటికీ గిరిజనుల పైకి మైథిన్లను ప్రోత్సహించి మైదాన ప్రాంతం వాసులు గిరిజనుల భూములు కొనే విధంగా చట్టం చేయాలనే డిమాండ్‌ కు ప్రభుత్వం పరోక్షంగా మద్దతు తెలపడం వలన మణిపూర్‌లో సమస్య ఇంత జటిలం అయిందన్నారు. ప్రభుత్వం అండ చూసుకొని మానవత్వం మంట కలిసేలా కుక్కి తెగకు చెందిన గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడి మానవత్వం మంట కలిసేలా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్‌ సుగుణ, యానియన్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు వి.సిద్ధమ్మ, ఖాజాబి, విజయమ్మ, అరుణ, సురేఖ, సుహాసిని, ఇందిరమ్మ, అమరావతి, అనసూయమ్మ, దీప్తి, హాజీరా, రాధ, ఇర్షాద్‌, రమీజా పాల్గొన్నారు.
రాయచోటి :మణిపూర్‌ లో గిరిజన మహిళలపై జరిగిన దారుణ సంఘటనకు నిరసనగా భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.ఈశ్వర్‌ సహాయ కార్యదర్శి మిఠాయిగిరి ఖాదర్బాషా నేతత్వంలో తహశీల్దార్‌ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్‌ ప్లెక్సీ వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో ఉండే 80 శాతం అటవీ ప్రాంతం నుండి కుక్కి తెగకు చెందిన గిరిజనులను తరిమివేసి అటవీ ప్రాంతంలో ఉన్న రకరకాల ఖనిజ సంపదను ఆదాని ,అంబానీలకు కట్ట పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుకీలు మైథిండ్ల మధ్య ఉన్న స్థానిక సమస్యలను ఉపయోగించుకుని మణిపూర్‌ మంటల్లో మాడిపోవడానికి కారణమైందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు ధనుంజరు కుమార్‌, రాజకుమార్‌ రాజు, ఆనంద్‌ కుమార్‌, కృష్ణయ్య, హుమయున్‌ భాష, రవిశంకర్‌, ఖీజర్‌ అలి, సయ్యద్‌, ఇలియాస్‌ భాషమ, వరలక్ష్మి, రేతేజ, జూనియర్‌ ఆనంద్‌, ఉత్తేజ్‌ పాల్గొన్నారు. పుల్లంపేట : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిం చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసా య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జయరామయ్య, కెవి పిఎస్‌ మండల కార్యదర్శి ఎన్‌.పెంచలయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు ఎ.చెంగయ్య, సి.హరి ప్రసాద్‌, సిఐటియు మండలం కార్యదర్శి కె.వి.రమణ, నాయకులు ఎ.సురేంద్ర, సి.రఘు పాల్గొన్నారు.