మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ నిరసన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : మణిపూర్‌లో ఇద్దర మహిళలను అత్యంత దారుణంగా నగంగా ఊరేగించి అత్యాచారం చేయడం చాలా దుర్మార్గమని దీనిని వ్యతిరేకిస్తూ సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెం నాగరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎఐసిసి పిలుపుమేరకు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదేసానుసారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌రెడ్డి సూచనల మేరకు ఆత్మకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి ఎపిసిసి ప్రధాన కార్యదర్శి చేవూరు శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ బిజెపి గుండాల నుండి మణిపూర్ రాష్ట్రాన్ని కాపాడాలని అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మస్తానయ్య, రాంఖీ, కొండా సతీష్, రొక్కల చిరంజీ, నందకిషోర్, తదితరులు పాల్గొన్నారు.










