Jul 28,2023 22:50

ఎఎన్‌యు: మణిపూర్‌లో జరుగుతున్న వివిధ ఆకత్యాలపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం విద్యార్థి, పరిశోధక సంఘాల నాయకులు శాంతి ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. యూనివర్సిటీలోని గాంధీ విగ్రహం నుంచి మెయిన్‌ గేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి మానవ హారం నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పలు నినాదాలు చేశారు. సుమారు 600 మంది విద్యార్థులు పరి శోధకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి పరిశోధకులు బి. హర్ష , పావనమూర్తి , కోటి యాదవ్‌ , పి .అభిషేక్‌ తదితరులు మాట్లాడారు. గడిచిన రెండు నెలలుగా మణిపూర్‌ లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా అక్కడ నివసించే ఒక వర్గంపై దాడి చేసి వారిని అమానవీయంగా హింసిస్తుండటం బాధాకరమన్నారు. ప్రపంచ దేశాల ముందు తలదించు కునేలా చేస్తున్నాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడ విల్లాలంటే ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే మణిపూర్‌ లో రాష్ట్రపతి పాలన విధించాలని, అక్కడ బాధితులుగా ఉన్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మణిపూర్‌ సంఘటనలపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని విన్నవించారు. మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్రంలో ఉన్న పార్టీలు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు స్పందించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు పరిశోధకులు అన్నారు.
మంగళగిరి: మణిపూర్‌ ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ ఎస్‌ చంగయ్య అన్నారు. శుక్రవారం రాత్రి మంగళగిరి సిఐటియు కార్యా లయంలో మణిపూర్‌లో జరుగుతున్న ఘటనను నిరసిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంగయ్య మాట్లాడుతూ మణిపూర్‌లో దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ మణి పూర్‌ లో జరుగుతున్న దారుణాలను అరికట్టడంలో అక్కడ బిజెపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్య క్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు పి.పూర్ణ, బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.