ర్యాలీ చేపడుతున్న క్రైస్తవులు
ప్రజాశక్తి -అనంతగిరి:మణిపూర్‌లో విధ్వంస పరిస్థితులు చక్కబర్చి, సాధారణ ప్రజా జీవన పరిస్థితులు నెలకొల్పాలని అనంతగిరిలో సోమవారం క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మూడు రోడ్ల మీదుగా వారపు సంత బొడ్డచెట్టు కొలని వరకు సాగింది. ఈ సందర్భంగా అనంతగిరి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు యస్.జె.కుమార్ పీటర్, జోషప్. నీలయ్య, డేవిడ్ పాల్ . మాట్లాడుతూ, మణిపూర్‌లో గిరిజనులపై జరుగుతున్న అమానుష చర్యలను ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆపలేక పోయాయన్నారు.ఈ ర్యాలీకి అరకు లోయకు చెందిన ఐక్యవేదిక ప్రతినిధులు బురిడీ. ఆనందరావు, ఓలేసి .బాబురావు, రావులపల్లి. రవి, సీపీఎం నాయకులు నేతలు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.










