Jul 30,2023 22:59

ర్యాలీ చేపడుతున్న క్రైస్తవులు

ప్రజాశక్తి-పాడేరు:మణిపూర్‌ రాష్ట్రంలో రోజు రోజుకి చెల రేగుతున్న హింసాకాండను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పాడేరు పట్టణంలో క్రైస్తవ సంఘాలు ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా అంబేద్కర్‌ సెంటర్లో మానవహారం నిర్వహించారు. మణిపూర్‌లో ఆదివాసీలు, క్రైస్తవుల పైన జరుగుతున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా వ్యతిరేకించాయి. మణిపూర్‌లో శాంతిని నెల కొల్పాలని క్రైస్తవులంతా ప్రార్థనలు చేశారు. మణిపూర్‌ ఘటనలు దేశానికి ముప్పు తలపెట్టే రీతిలో ఉన్నాయని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు రీమలి జాన్‌ సిహెచ్‌ దైవ కృప, తిమోతి, ఎలిషా రావు, మోహన్‌ రావు, రవికుమార్‌, కళ్యాణం, పాస్టర్లు, మహిళలు పాల్గొన్నారు