Jul 23,2023 23:11

ప్రజాశక్తి-యంత్రాంగం మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న అమానవీయ సంఘటనల పట్ల పలుచోట్ల ఆదివారం ఆందోళనలు చేపట్టారు. కాకినాడలో సివైఎఫ్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ మూర్తిరాజు అధ్వర్యంలో రేస్‌ ఆఫ్‌ పీస్‌ వర్షిప్‌ సెంటర్‌ సభ్యులు ఎపిఎస్‌పి నుంచి సర్పవరం జంక్షన్‌ వరకూ పెద్దఎత్తున ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మూర్తి రాజు మాట్లాడుతూ మన దేశాన్ని కాపాడే సైనికుడి భార్యకే రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సివైఎఫ్‌ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ జంగా గగారిన్‌ చౌదరి, జిల్లా కో ఆర్డినేటర్‌ జిమ్‌ విల్సన్‌, అబ్రహాం రెడ్డి, వల్లూరి నానాజీ, మధు సూదన్‌ రావు, వారా వినోద్‌ తదిత రులు పాల్గొ న్నా రు. అన్నవరంలో దళిత క్రైస్తవ సం ఘాల ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ మైనార్టీలపై హింసాత్మక దాడుల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. జగ్గంపేట రూరల్‌లో సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు జక్కంపూడి రాజు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులాపల్లి అచ్చారావు, రమణ, రొబ్బల సంకురమ్మ, ఇమ్మిడి లక్ష్మి, గుమ్మడి నూకరత్నం పాల్గొన్నారు.