Jul 31,2023 23:51

దుగ్గిరాలలో నిర్వహిస్తున్న శాంతి ర్యాలీ

దుగ్గిరాల: మణిపూర్‌లో ఘటనలను నిరిసిస్తూ మండల కేంద్రం దుగ్గిరాలలో సోమవారం శాంతి ర్యాలీని నిర్వహించారు. ముం దుగా దళితవాడలోని లూధరన్‌ చర్చి వద్ద శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. జడ్పిటిసి మేకతోటి అరుణ జాతీయ జెండా ఊపి ర్యాలీని ప్రారం భించారు. అనంతరం తహశీల్దార్‌ కె.మల్లేశ్వరికి అర్జీని అంద జేశారు. ఈ సందర్భంగా దుగ్గిరాల మండలం పాస్టర్‌ ఫెలోషిప్‌ అధ్యక్షుడు ఉన్నం సురేష్‌బాబు మాట్లాడుతూ మణిపూర్‌లో ఘోరమైన సంఘటనలు జరుగుతున్నప్పటికీ కేంద్రం, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్పందిం చడం లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చేబ్రోలు: మణిపూర్‌ ఘటనలను చేబ్రోలు క్రైస్తవ సమాఖ్య, పాస్టర్స్‌ ఫెలోషిప్పులు, క్రైస్తవ సంఘాలు నిరసించాయి. తహశీల్దార్‌ , మండల మేజిస్ట్రేట్‌, కె వి గోపాలకృష్ణ, చేబ్రోలు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె.ఆనంద్‌, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి బి.బాబు రావుకు వినతిపత్రం అందజేశాయి.