Jul 30,2023 23:51

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి, కాకినాడ కార్పొరేషన్‌ మణిపూర్‌లో మహిళపై జరిగిన సంఘటనను నిరసిస్తూ ఉప్పాడలో క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. అమీనాబాద్‌ నుంచి ఉప్పాడ, కొత్తపల్లి, వాకతిప్ప, కుతుడుమిల్లి మీదుగా వందలాదిగా ప్రజల పాల్గొఆ్నరు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మణిపూర్‌లో దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో ఉప్పాడ, అమీనాబాద్‌, మాయాపట్నం, సుబ్బంపేట, తదితర గ్రామాల నుండి వేలాది సంఖ్యలో పాల్గొన్నారు
మణిపూర్‌ సంఘటనపై జనకవన గళం
సాహితీస్రవంతి, యుటిఎఫ్‌ ఆధ్వర్యాన కాకినాడ యుటిఎఫ్‌ హోమ్‌లో జనకవనం నిర్వహించాయి. సభకు యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ప్రభాకరవర్మ అధ్యక్షత వహించారు. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ జోస్యుల కృష్ణబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గనారా, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, గోవిందరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సాహితీ స్రవంతి నగరాధ్యక్షుడు జానకిరామ చౌదరి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ఆదీవాసీ మహిళలను నగంగా ఊరేగించి, అత్యాచారం జరపడం యావద్దేశం సిగ్గుపడాల్సిన విషయమని ప్రభాకరవర్మ అన్నారు. ఇది పాలకులు కేవలం తమ ఉనికిని కాపాడుకొనేందుకు రెండుతెగల మధ్య రాజేసిన నిప్పు అని కృష్ణబాబు అన్నారు. గనారా మాట్లాడుతూ కుల మతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే సంఘ విద్రోహుల కుట్రగా ఈ సంఘటనను అభివర్ణించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనకవనంలో గరికపాటి మాస్టారు, మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, మార్ని జానకి రామచౌదరి, మేడిశెట్టి శ్రీరాములు, గౌరినాయుడు, కొత్తశివ, అవధానుల మణిబాబు, నాగజ్యోతి, రత్నాజరు, రమణ, ఉండవిల్లి, మాకినీడి, సీతారామరాజు, ఇంద్రగంటి, ఇబ్రహీం, జనార్థనస్వామి, డాక్టర్‌ శిరీష, పలువురు సాహితీవేత్తలు తమ కవితలను వినిపించారు. పలువురు సాహితీవేత్తలు, నాయకులు పాల్గొన్నారు.