Aug 30,2023 21:25

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న పాస్టర్లు

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ : మణిపూర్‌లో జరుగుతున్న వరుస ఘటనలకు నిరసనగా మండలంలోని కూరుకుట్టి నుండి మామిడిపల్లి వరకు ట్రైబల్‌ పాస్టర్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెలోషిప్‌ ప్రతినిధి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా మణిపూర్‌లో సభ్య సమాజం తలదించుకునేలా గత ఆరు నెలలుగా అక్కడ రెండు తెగలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని అసాంఘిక శక్తులు విచక్షణ రహితంగా దాడులు జరిపి ఇళ్లలను చర్చిలను తగలబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలు, మానభంగాలు జరిపి హత్యలు జరుగుతున్నా అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల వారు స్వేచ్చగా బతకడానికి హక్కులను కాపాడాల్సిన బాధ్యత అక్కడ ప్రభుత్వాలపై ఉన్నాయని, ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. కార్యక్ర మంలో పలువురు పాస్టర్‌ పాల్గొన్నారు.