శాంతి ర్యాలీ
ప్రజాశక్తి-బాపట్ల రూరల్: మణిపూర్ సంఘటన అమానుషమని, అక్కడ జరుగుతున్న దాడులను కట్టడి చేయాలని కోరుతూ సోమవారం బాపట్ల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించి, అనంతరం బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని అక్కడ పరిస్థితులు శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవి ప్రదీప్, డాక్టర్ డేవిడ్ రాజు, గుదే రాజారావు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ప్రభాకర్, కేవివి నాయకులు కోట వెంకటేశ్వర్‌రెడ్డి, కాగిత కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










