కడప అర్బన్ : మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ మహి ళలను నగంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బిఎ.మనోహర్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిఅన్వేష్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఐ ఎన్ సుబ్బమ్మ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో నాగా, కుకి ఆదివాసిలపై జరుగుతున్న మారణహోమాన్ని ఆపాలని, మహిళలపై జరు గుతున్న అత్యాచారాలను అరికట్టాలని, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రం మూడు నెల లుగా అగ్నిగుండంగా మారడానికి కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. మోదీ ప్రభుత్వం అధికారాన్ని దక్కించు కోవడానికి, పాలనను సుస్థిరం చేసుకోవడానికే నరమేధం చేస్తుందన్నారు. 2002లో గుజరాత్ మారణకాండను సష్టించిన మోదీ, అమిత్‌షా లే మణిపూర్ రాష్ట్రానికి చిచ్చు పెట్టారని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయితీలకు ఎస్‌టి హోదాను కల్పించడాన్ని నాగా, కుకి ఆదివాసి తెగలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. తమకు ఉన్న అవకాశాలను కోల్పోతామని భావిస్తున్నారని అన్నారు. మెయితీలకు, ఆది వాసీ తెగలకు మధ్య అగ్గి రాజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పబ్బం గడుపుకొం టున్నాయని ఎద్దేవా చేశారు. మే4న వందల మంది దుండగుల గుంపు ఇద్దరు కుకి మహిళలను వివస్త్రను చేసి, నగంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశానికే మాయని మచ్చని అన్నారు. అందులోని ఒక మహిళకు చెందిన తండ్రిని, తమ్ముడిని కిరాతకంగా హత్య చేశారని అన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటనలు జరగడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ సంఘటన చోటు చేసుకున్న 80 రోజుల కు కేవలం ఆరుగురిని అరెస్టు చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ఈ అమానవీయ సంఘటన పట్ల సుప్రీం కోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారిచేయడమే కాక తామే రంగంలోకి దిగుతామని ప్రకటించిందని తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో 164 మంది చనిపో యారని, 300కు పైగా చర్చిలు నేలమట్టం చేశారని ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయని వాపోయారు. మణిపూర్ రాష్ట్రం తగలబడుతుంటే గిరిజన మహిళ ముర్ము రాష్ట్రపతిగా ఉండి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సంఘటనకు భాద్యత వహిస్తూ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా రాజీ నామా చేయాలని, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని భర్త్ రఫ్ చేయాలని చేయాలని, మహిళలపై జరుగుతున్న, అత్యాచారాలను, హత్య లను అరికట్టాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్ర మంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య, ఎం. వి. సుబ్బారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ శివారెడ్డి, నగర సిఐటియు అధ్యక్షులు చంద్రారెడ్డి, రామకష్ణారెడ్డి మహిళా సంఘం నాయకులు జమీల డివైఎఫ్‌ఐ నగర నాయకులు విజరు, ఉదరు తో పాటు ఆటో వర్కర్స్ యూని యన్ నాయకులు పాల్గొన్నారు.
మారణకాండ మానవత్వానికి మచ్చ : యుటిఎఫ్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు, ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న మారణకాండను యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధానకార్యదర్శి పాళెం మహేష్ బాబు ఖండించారు. మంగళవారం సాయంత్రం కడప ఆర్‌టిసి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లర్లను నిలుపుదల చేయాల్సిన మణిపూర్ రాష్ట్ర ముఖ్య మంత్రి బీరేన్ సింగ్ వాటిని ప్రోత్సహిస్తూ జాతుల మధ్య ఘర్షణలు పెంచారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మణిపూర్ మారణకాండకు ముగింపు పలకాలని కోరారు. లేనిపక్షంలో మణిపూర్ బాధితుల పక్షాన ఎంతటి పోరాటాల కైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహా ధ్యక్షుడు రవికుమార్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్, సరస్వతి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మధుసూదన, యుటిఎఫ్ నాయకులు మజ్జారి చెన్నకేశవులు, చంద్రశేఖర్, వీరనారాయణ, కిరణ్ కుమార్, కరీముల్లా, బాబు, జి. వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.










