Jul 14,2023 14:54

ప్రజాశక్తి-తడ : తడ మండలంలోని చేనిగుంట కాలనీ సమీపాన గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందాడు. నెల్లూరు నుండి చెన్నైకు వెళుతున్న రైలు సుమారుగా ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ దుర్ఘటన 73/23,73/21 పోల్ మద్య జరిగింది. .సమాచారం అందుకున్న రైల్వే పోలీసు వారు సంఘటనా స్ధలంకు చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంకు తల కనిపించడంలేదు అలాగే కాళ్ళు చేతులు కూడా దూర దూరంగా పడివున్నాడు.