Sep 14,2023 21:28

మంత్రితో బత్తలపల్లి వైసిపి నాయకులు

బత్తలపల్లి : రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బత్తలపల్లిలో వైసిపి నాయకులు ఘనస్వాగతం పలికారు. గురువారం తిరుపతి నుంచి అనంతపురానికి రోడ్డు మార్గాన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న ఏపీ కురుబ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు, డిసిఎంఎస్‌ చైర్మన్‌ తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ బగ్గిరి బయపరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.