Sep 14,2023 22:40

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

ప్రజాశక్తి - వినుకొండ : బ్రాహ్మణపల్లి రెవెన్యూ జాలలపాలెం వద్ద 175 ఎకరాల ప్రభుత్వ భూమి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేశాడని, మంత్రి కారుమూరు నాగేశ్వరరావుకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో థర్డ్‌ పార్టీ ఏజెన్సీ నుండి సర్వే చేయించి పేదలకు పంచాలని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. లోకా యుక్తకు రెవెన్యూ జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలో 175 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, కుంట, అడవి, చెరువు, జాగీర్‌దారుల మాన్యం, ప్రభుత్వ అసైన్డ్‌ భూములున్నాయని నిర్థారించారని చెప్పారు. బియ్యం, మట్టి మాఫియా కింగ్‌ను పక్కన పెట్టుకుని బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి చెప్పడం విడ్డూరమన్నారు. నియోజకవర్గంలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తూ టన్నుకు రూ.10-15 వేలు వసూలు చేసి కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. వేల ట్రక్కుల మట్టిని ఎమ్మెల్యే అక్రమంగా తరలించుకున్నారని ఆరో పించారు. రేషన్‌ ద్వారా కందిపప్పు ఇవ్వలేని అసమర్ధ ప్రభు త్వమన్నారు. సమీక్షలే గాని నిధులివ్వడం లేదని విమర్శి ంచారు. టిడిపి హయాంలో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంటింటికీ కుళాయిలు ఇవ్వాలన్నారు.