
ప్రజాశక్తి - రామచంద్రపురం
రాష్ట్ర ప్రభుత్వం విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేబినెట్‌లో నిర్ణయించడంపై రామచంద్రపురంలో విలేకరులు ఆదివారం బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను కలిసి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయించడంపై విలేకరులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోటిపల్లి రేవులో అనధికార పంటుల నిర్వహణపై ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన వార్తపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటిపల్లి రేవులో జరుగుతున్న అక్రమాలపై మాత్రమే వార్తను రాశామని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల వివరణ సైతం తీసుకుని ప్రచురించామని విలేకరి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ మంత్రి పట్టించుకోకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. అవినీతి కథనంపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడటంపై అక్కడివారంతా విస్తుపోయారు.