Apr 22,2023 00:31

గుంటూరు జిల్లా ప్రతినిధి: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను రాష్ట్ర మునిసిపల్‌ మంత్రి ఆదిమూల సురేష్‌ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టిడిపి కార్యకర్తలు శుక్రవారం రాత్రి నిరసన తెలిపారు. మంత్రి సురేష్‌ చర్యలకు నిరసనగా టిడిపి నాయకులు కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో టీఎన్‌ ఎస్‌ఎఫ్‌, దళిత సంఘాల లాడ్జి సెంటర్‌లో బైఠాయించి ధర్నా చేశారు. యర్ర గొండపాలెంలో వైసిపి నాయకుల తీరును టిడిపి నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్‌ ఖండించారు.