ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పంచాయతీ పరిధిలోని చెర్లోతాండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వైసిపి ఎస్‌టి సెల్ జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్ నీటి సమస్య తీవ్రత గురించి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకెళ్లాడు. బోరు వేయించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి సురేష్ సొంత నిధులతో ఆదివారం బోరు వేయించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేసిన మంత్రి సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సురేష్ నిధులతోనే మోటారు, పైపులు ఏర్పాటు చేసి చెర్లోతాండా గిరిజనులకు మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా నీటి సమస్య ఉంటే మంత్రి చొరవతో పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వీరయ్య, కాశి నాయక్, పెద్ద మంత్రూ నాయక్, బాలాజీ నాయక్, మంత్రూ నాయక్, శ్రీను నాయక్ బాబులు నాయక్, బాలు నాయక్ పాల్గొన్నారు.










