సమావేశంలో పాల్గొన్న సర్పంచ్‌లు, ఎంపిటిసిలు
ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్ : మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు బుధవారం రహస్యంగ సమావేశమయ్యారు. 11 మంది సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపిటీసిలు అసమ్మతి నేత చిట్టా విజయభాస్కరరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. తమను మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోవటం లేదని, ప్రజాప్రతినిధులైన మిమల్నీ విస్మరించి మంత్రి అనుచరులే పెత్తనం చేస్తున్నారని విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. రెండ్రోజుల్లో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు.










