Apr 30,2023 22:25

ప్రజాశక్తి-కోటనందూరు పెద్దాపురం డిఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన లతా కుమారి ఆదివారం రోడ్లు భవనాల శాఖామంత్రి దాడిశెట్టి రాజాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా పోలవరంలో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీల్లో పెద్దాపురం వచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రణాళిక రూపొందించామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని డిఎస్‌పి తెలిపారు.