మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో
మైనార్టీ సోదరులు వైసిపి తీర్థం
ప్రజాశక్తి -చౌడేపల్లి: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో మండలానికి చెందిన మైనార్టీ సోదరులు వైసిపిలో చేరారు. చౌడేపల్లి మండలం 29ఏ చింతమాకులపల్లి పంచాయతీ ఖాన్సాబ్ మిట్టకు చెందిన టిడిపి నాయకుడు నూరుల్లా అతని అనుచరులు కుటుంబ సభ్యులు 30 మందితో తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా మైనార్టీల అభివద్ధికి పలు పథకాలు ప్రవేశపెట్టి ఆ ఫలాలు నేరుగా వారి ఇళ్ళకే చేరే విధంగా కషి చేస్తున్నామని ఆయన వివరించారు. వైసిపిలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందని రాబోయే కాలంలో కష్టపడి పనిచేసిన వారికి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పెద్దపీట వేస్తామన్నారు. అంతకు ముందు చౌడేపల్లి నుంచి వచ్చిన అ నాయకులతో ఆయన జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి వైసిపి అధ్యక్షుడు కూరపర్తి అంజిబాబు, ఎంపీపీ గాజుల రామ్మూరి,్త ఉపాధ్యక్షుడు నరసింహులు యాదవ్, హెచ్డిఎఫ్సి చైర్మన్ కళ్యాణ్ భరత్, మండల సచివాలయాల కన్వీనర్ రుక్మిణమ్మ ,సర్పంచులు శ్రీరామ్ భరత్ వరుణ్, షంషీర్, హైమావతి, రవికుమార్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ సాదిక్ అజీజుల, రషీదా బేగం, రాధాపతి పాల్గొన్నారు.










