Sep 03,2023 17:19

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
            ఆదికవి నన్నయ క్యాంపస్‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్‌ టి.అశోక్‌ ఆదివారం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను మర్యదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా టి.అశోక్‌ను మంత్రి కొట్టు సత్యనారాయణ అభినందించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం అశోక్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్య, పరిశోధన, క్యాంపస్‌ అభివృద్ధి ప్రమాణాలను మరింత పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.