మాట్లాడుతున్న వైసిపి నాయకులు
ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని వందవాగిలిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, నెరణికి దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, వైసిపి తాలూకా ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణస్వామి సహకారంతో గ్రామాభివృద్ధి చేసినట్లు వైసిపి సీనియర్ నాయకులు, సచివాలయ కన్వీనర్ ఎం.మెలిగిరి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుంచి మసీదు వరకు రూ.25 లక్షలతో మంత్రి జయరామ్ సహకారంతో సిసి రోడ్డు, డ్రెయినేజీ వేసినట్లు తెలిపారు. సిసి రోడ్డు పనులు పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులు జయన్న, కె.లక్ష్మి కాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.