మంత్రి ఇలాకాలో దళిత సర్పంచ్‌పై వివక్ష
తిరుపతి బ్యూరో: రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు నియోజకవర్గంలో దళిత సర్పంచి పై సమావేశంలో వివక్ష చూపడంతో విషయం దళిత సంఘాలలో చర్చనీయాంశమైంది. పుంగనూరు మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తతంగా పర్యటించి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. సింగిరిగుంట గ్రామపంచాయతీ కేంద్రంలో ఆర్‌బికె నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేసి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పంచాయతీకి ప్రథమ పౌరుడైన దళిత సర్పంచ్ ఆంజప్పకు వేదికపై కుర్చీ వేయకపోయినా వేదిక వెనుక వైపు నిలబడి సభలో పాల్గొనడం సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. దళిత సర్పంచ్ అని వివక్ష చూపడమేనని పలువురు విమర్శిస్తున్నారు. మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉండటం శోచనీయం. ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప పాల్గొన్న సహచర దళితున్ని గుర్తించకపోవడం బాధాకరమైన విషయమని పలు దళిత సంఘనేతలు అంటున్నారు.










