మంత్రి బుగ్గనను విమర్శించే అర్హత వారికి లేదు : వైసిపి
ప్రజాశక్తి - బేతంచెర్ల
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు కళ్లెదురుగా చూస్తూ కూడా టిడిపి నాయకులు విమర్శలకు దిగడం తగదని, నిజానికి వారికి విమర్శించే అర్హత లేదని వైసిపి నాయకులు సిహెచ్ చెల్లెంరెడ్డి,. గూని నాగరాజ్, మురళీకృష్ణ, రామచంద్రుడు, ముర్తుజావలి, యాకోబ్‌లు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వైసిపి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏమాత్రం ఓటింగ్ లేని సర్పంచులతో పోటీ చేయించి బిసిలకు వైసిపి అన్యాయం చేస్తుందని అనడం తగదన్నారు. వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును బిసిలకే కేటాయించింది టిడిపి గుర్తించాలన్నారు. టిడిపి కార్యాలయంపై దాడికి వెళ్దామన్న మాట అవాస్తవమన్నారు. గత రెండు రోజులుగా మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు మాత్రమే టిడిపి కార్యాలయం వైపు వెళ్లామని, ఎలాంటి అరాచకాలకు పాల్పడే సంస్కతి తమది కాదన్నారు. ఇప్పటికైనా విమర్శలు చేసే నాయకులు విషయ అవగాహనతో మాట్లాడటం మంచిదని హితవు పలికారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు ముర్తుజావలి, మండల వైస్ ఎంపీపీ రంగస్వామి, మాజీ ఎంపీటీసీ రంగస్వామి, ఎద్దులన్న, యాకోబు, ప్లాట్ల దస్తగిరి, తిరుమలేశ్వర్ రెడ్డి, మద్దిలేటి స్వామి చైర్మన్ రామచంద్రుడు, కౌన్సిలర్ నిరంజన్, నాగ వెంకటేశ్వర్లు, మధు, కిరణ్, లక్ష్మి రెడ్డి, మనోహర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










