Oct 28,2022 23:14

ప్రజాశక్తి - గన్నవరం : గన్నవరం నియోజకవర్గం అంబాపురం పంచాయతీ ఇనామ్‌ నగర్‌ మదర్సా వద్ద డిప్యూటీ సీఎం మైనార్టీ శాఖ మంత్రి ఎస్‌బి.అంజాద్‌ బాషాను శుక్రవారం ఆజాద్‌ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ నాగుల్‌ మీరా కమిటీ ప్రతినిధులు కలిశారు. వైఎస్‌ఆర్‌ షాది తోఫా పథకానికి సంబంధించి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పదో తరగతి చదువుకుని ఉండాలన్న నిబంధన ఎత్తివేయాలని, షాది తోఫా పథకం మదర్సాల్లో చదువుకునే పిల్లలకు, అసలు చదువుకోలేని పిల్లలకు వచ్చేలా కషి చేయాలని కోరారు. విజయవాడలో హజ్‌ హౌస్‌ ఏర్పాటు చేయాలని, ఇస్లామిక్‌ బ్యాంకులు ఏర్పాటు చేసి పేద ముస్లింలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌసల్‌ ఆజామ్‌, ఆజాద్‌ ముస్లిం కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యండి కాలేషా తదితరులు పాల్గొన్నారు.