
ప్రజాశక్తి-పాయకరావుపేట:మండలంలోని గోపాల పట్నంలో రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్, పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్, బాబురావు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి రైతు బాంధవుడని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, పోలవరం ప్రాజెక్టు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అభివద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా ప్రచార పబ్లిక్ వింగ్ జిల్లా అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు, జడ్పిటిసి లంక సూర్యనారాయణ ఎంపీపీ పార్వతి తాతారావు వైయస్సార్ వైయస్సార్ ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు