Jul 02,2023 20:36

మాట్లాడుతున్న అలిగిరి రవి మాదిగ

ప్రజాశక్తి - మంత్రాలయం
నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర మహాసభలు మంత్రాలయంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అలిగిరి రవి మాదిగ, జిల్లా అధ్యక్షులు రామతీర్థం అమ్రేష్‌ మాదిగ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రయివేట్‌ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాదిగ, మాదిగ ఉపకులాల సంక్షేమమే లక్ష్యంగా ఈ నెలలో రాష్ట్ర అధ్యక్షులు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ కార్యకర్తలు, మాదిగ, మాదిగ ఉపకులాలు హాజరయి విజయవంతం చేయాలని కోరారు. బహుజన ఐక్యవేదిక ఫౌండర్‌ కిరణ్‌, నవ్యాంధ్ర జిల్లా మహిళా అధ్యక్షులు కదిరికోట బతుకమ్మ, నాయకులు మారెప్ప, సుమాల చార్లెస్‌, లోకేష్‌, రుబెన్‌ పాల్గొన్నారు.