Apr 06,2023 23:54

ఎంపీపీ బీ.ఈశ్వరి అధ్యక్షతన

ప్రజాశక్తి-డుంబ్రిగూడ:బోయ/వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించడానికి ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎంపీపీ బీ.ఈశ్వరి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఈశ్వరి మాట్లాడుతూ, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేటప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించి భాగస్వాములు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అధికారులు జాప్యం చేయకుండా వేగంగా పనులు చేసి మండల అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సిహెచ్‌ జానకమ్మ, వైస్‌ ఎంపీపీలు ఎస్‌ ఆనంద్‌, లలిత, ఎంపీడీవో నగేష్‌, తహసిల్దార్‌ షేక్‌ ముజీబ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.