Nov 16,2023 18:49

మంగళసూత్రం అందజేస్తున్న దృశ్యం

మంగళసూత్రం అందజేస్తున్న దృశ్యం
మంగళసూత్రం బహూకరణ
ప్రజాశక్తి-బిట్రగుంట:బోగోలు మండలం చెంచులక్ష్మి పురం గ్రామంలో ఏసు పోగు కిషోర్‌, సౌందర్య వివాహ మహోత్సవానికి పిఎస్‌ ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత పసుపులేటి సుధాకర్‌ సాకారంతో మాజీ మండల అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు గురువారం వారి కుటుంబ సభ్యులకు మంగళసూత్రాన్ని బహుకరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి,ఎస్‌,ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత పసుపులేటి సుధాకర్‌ సహకరంతో బోగోలు మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు సీతారామయ్య, వరలక్ష్మి, చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు తదితరులున్నారు.