Feb 16,2023 23:03

ప్రజాశక్తి-విజయవాడ రూరల్‌ 

విజయవాడ రూరల్‌ మండలంలోని మంగళాపురం (వెంకటాపురం)ప్రాథమిక పాఠశాలను గురువారం నైజీరియా దేశ బందం ప్రథమ్‌ సంస్థతో కలిసి సందర్శించింది. బోధనా విధానం, పిల్లల్లో అభ్యసన సామ ర్ధ్యంతో పాటు వసతులు పరిశీలించింది. ఈ సందర్భంగా బందం సభ్యులు విద్యార్థులతో ముచ్చటిం చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో అమలు చేస్తున్న పథకాల గురించి ఎస్‌ఎస్‌ఏ సహాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ జి.మహేశ్వరరావు వారికి వివరించారు. సరైన విధానంలో బోధన అమలును పరిశీలించింది. విద్యా ర్థుల సామార్థ్యానికి తగినట్లు బోధన జరు గుతుందో లేదో గమనించి సంతప్తి వ్యక్తం చేసింది. నైజీరియా దేశం నుండి ఎనిమిది మంది, ఢిల్లీ నుంచి ముగ్గురు సభ్యులు విద్యార్థులు తమ కిచెన్‌ గార్డెన్‌ నుండి కోసిన వంకాయలు, బెండకాయలు, ములగ, పువ్వుల వంటి వస్తువులతో నిర్వహించిన సంత నిర్వహణ, అమ్మడం, కొనడం వంటి కత్యాలలో విద్యార్థులతో కలిసి అధికారులు,విదేశీయులు 'సంత' లో పంచుకోవడం విశేషం. విద్యార్థులు చేతుల్లో తయారైన పేపర్‌ క్రాప్సీను వారంతా అభినందించారు. బందం కు పాఠశాల ఉపాధ్యాయులు పి. మనోజా, అరుణ కుమారి, ఎంఇఓ ఎ. వెంకరత్నం లు పాఠశాల లో జరిగే తీరు ను వివరించారు.