Jun 19,2023 00:06

కూరగాయల

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: మండుతున్న ఎండలతో పాటు మార్కెట్‌లో కూరగాయల ధరలు కూడా మండి పోతున్నాయి. కొన్ని రోజుల నుంచి కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పాటు విద్యుత్‌ చార్జీల మోతతో సతమవుతున్న సామాన్యులపై కూరగాయల ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ఏ కూరగాయలు కొనాలన్నా ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండల తీవ్రతకు దిగుబడులు దారుణంగా పడిపోవడంతో ఈ రేట్లు అమాంతం పెరిగి పోయాయి. రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఏ కూరగాయలు కొనాలన్నా ధరలతో బెంబేలెత్తుతున్నారు.
పాడేరు మార్కెట్‌లో కిలో టమోట రూ.45, వంకాయలు కిలో రూ.40, బెండకాయలు రూ.50, పచ్చిమిర్చి కిలో రూ.60, అరటికాయ రూ.8కి అమ్ముతున్నారు. బంగాళదుంప కిలో రూ.30, దొండకాయలు రూ.40, . అల్లం కిలో రూ.250, బీరకాయలు కిలో రూ.60, క్యాప్సికం ్ల కిలో రూ.90, అనపకాయ రూ.20, ఉల్లిపాయలు కిలో రూ.25 అమ్ముతున్నారు. ఎండలు మండిపోతుండడంతో ఆ ప్రభావం పంటలపై పడి దిగుబడి తగ్గడంతో కూరగాయల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మార్కెట్‌లోకి వెళ్లాలంటే పేద, మద్య తరగతి ప్రజలు ధైర్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఐదు, ఆరు నెలల క్రితం కూరగాయల ధరలు కొద్దిగా అందుబాటులో ఉన్నా ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి.
పేద కుటుంబాలకు మూడు పూటల కూరగాయల భోజనం తాహతుకు మించిన భారంగా మారుతోంది.
ధరలు బాగా పెరిగాయి..నెల కిందట, ప్రస్తుతం ధరలకు ఎంతో తేడా ఉంది. ఏది కొనాలన్నా రూ. 50పైనే ఉంది. ఇలాగైతే సామాన్యులు బతకడం కష్టమే. కూరగాయల ధరలను నియంత్రించాల్సిన అవస రముంది. కొందరు మద్య వర్తులు అకారణంగా ధరలు పెంచుతున్నారు. గతంలో కిలోకు వెచ్చించిన ధరతో ఇప్పుడు కనీసం పావు కిలో రావడం లేదు.