Jul 23,2023 21:42

మందుల నాణ్యతకు పెద్దపీట

కడపప్రతినిధి : మందుల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీల ద్వారా ప్రజారోగ్యానికి పాటుపడుతున్నాం. జాతీయ డ్రగ్స్‌ అండ్‌ కంట్రోల్‌ పాలసీ ప్రకారం దుకాణదారులు, కంపెనీల నిర్వాహకులు నిబంధనల్ని తు.చ తప్పకుండా పాటించాలి. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో నిరంతర తనిఖీలు చేపపట్టడం అత్యవసరం. మందుల దుకాణాల నిర్వహణకు లైసెన్స్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలి. డ్రగ్స్‌ అండ్‌ కంట్రోల్‌ పాలసీ మేరకు నిబంధనలు పాటించని దుకా ణదారులకు భారీ జరిమానాలు విధిస్తాం. ప్రజానీకం యాంటీబయా టిక్స్‌, స్టెరాయిడ్స్‌ను వైద్యుల సిఫారసు ద్వారా మాత్రమే వాడుకోవాలి. లేనిపక్షంలో ప్రజారోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొంటున్న డ్రగ్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఎడి నాగకిరణ్‌కుమార్‌తో ప్రజాశక్తి ముఖాముఖి..
డ్రగ్స్‌ అండ్‌ కంట్రోల్‌ పని విధానాల గురించి తెలపండి?
జిల్లాలోని మందుల దుకాణాలను నిరంతరం తనిఖీలు చేయడం, బ్లడ్‌బ్యాంకులు, ఆక్సిజన్‌ యూనిట్స్‌, బల్క్‌ డ్రగ్‌ ఫార్ములేషన్‌ కేంద్రాలను పర్యవేక్షించడం, మందుల దుకాణదారులు మందులను అధిక ధరలకు విక్రయించకుండా చూడడం, నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం వంటి అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి.
మందుల దుకాణాల వివరాలు తెలపండి?
విభజిత వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని 36 మండలాల్లో1200 మందుల దుకాణాలున్నాయి. ఇందులో హోల్‌సేల్‌ 800, రిటైల్‌ దుకాణాలు 900 ఉన్నాయి. రోజూ ర్యాండమ్‌గా మందుల తనిఖీలు చేయడం, ఏడాదికి రెండు దఫాలుగా మందుల కంపెనీలను తనిఖీలు చేయడం ద్వారా నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడానికి కసరత్తు చేస్తున్నాం.
డ్రగ్స్‌ కంపెనీల కార్యకలాపాల గురించి వివరించండి?
జిల్లాలో ఎనిమిది బ్లడ్‌బ్యాంకులున్నాయి. ప్రొద్దుటూరులో రెండు, కడపలో ఐదు, పులివెందుల ఒకటి, స్వచ్చంధ సంస్థల ఆధ్వ ర్యంలో కడపలోని ఐఆర్‌సిఎస్‌, ప్రొద్దుటూరు ఒకటి, కడపలో రెండు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని మూడింట్లో కడప, ప్రొద్దుటూరు, పులివెందుల ప్రాంతాల్లో ఒకొక్కటి చొప్పున ఉన్నాయి. వీటితోపాటు టెక్నికల్‌ డివైస్‌ విభాగాలు మూడు, కొప్పర్తిలో ఆక్సిజన్‌ యూనిట్స్‌, కడపలో బల్క్‌ డ్రగ్స్‌ ఫార్ములేషన్‌ యూనిట్స్‌ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
స్టాఫ్‌ కొరత గురించి చెప్పండి?
స్టాఫ్‌ కొరత ఉన్న మాట వాస్తవమే. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. కానీ ఒక్కరే ఉండడంతో సమస్య ఎదురవుతోంది. కడప జిల్లా కేంద్రంలో ఒకరు, జమ్మలమడుగు కేంద్రంగా ఒకరు ఉండాలి. ఇందులో జమ్మలమడుగు డివిజన్‌లో అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నారు.
కేసుల వివరాల గురించి తెలపండి?
జిల్లాలో సుమారు 30 కేసులు నమోదు చేయడమైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒకటి మాత్రమే నమోదైంది. కోర్టు ట్రయ ల్స్‌లో ఉన్నాయి. వారంలో మూడు రోజుల వరకు కోర్టు కేసులకు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది.
కేసుల నమోదుకు ప్రాతిపదికలు, పారామీటర్లు ఏమిటి?
జిల్లాలో మందుల దుకాణాదారులు దగ్గర నుంచి మందుల కంపెనీల వరకు క్వాలిటీని పాటించాలి. అధిక ధరలకు మందులు విక్రయించరాదు, లైసెన్స్‌లు లేకుండా మందుల క్రయ,విక్రయ కార్య కలాపాలు విక్రయించడం వంటి అంశాలపై కేసులు నమోదు చేస్తాండ్రగ్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఎడి ఎ.కిరణ్‌కుమార్‌ వెల్లడ