
రాయచోటి : జిల్లాలోని ప్రజలందరికీ నాణ్యమైన మందులు అందించడమే తమ లక్ష్యమని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఎస్. జయరాములు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో నాణ్యమైన మందులు, లైసెన్సులు, ప్రజలు ఎలాంటి మందులు వాడాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
జిల్లాలో ఔషధ కార్యాలయాల అధికారులు, వారి వివరాలు తెలపండి?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఔషధ తనిఖీ అధికారి కార్యాలయాలు రాయచోటి, మనదపల్లెల్లో రెండు ఉన్నాయి. జిల్లా ఔషధ నియంత్రణ కార్యాలయం జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఉంది.
ఔషధ కార్యాలయాల పని విధానాలేంటి?
డ్రగ్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ అమలు చేస్తాం. దీంతోపాటు డ్రగ్స్ అండ్ మ్యాజిక్, మందుల తయారీ కంపెనీలను తనిఖీ చేయడం, లైసెన్సులు మంజూరు చేయడం అలాగే షాపుల మార్పిడికి పరిశీలించడం, లైసెన్సులు జారీ చేయడం జరుగుతుంది. జిల్లాలో మందుల నిరంతరం తనిఖీ చేయడం, బ్లడ్ బ్యాంకుల్, ఆక్సిజన్ యూనిట్లు, మందుల దుకాణాదారులు అధిక ధరలకు విక్రయించుకుండా చూడడం, నిబంధనలను పాటించిన వారిపై కేసులు నమోదు చేస్తాం.
జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి?
రాయచోటి ఔషధ తనిఖీ కార్యాలయ పరిధిలో 630 మందులు షాపులున్నాయి. ఇందులో 550 రిటైల్, 64 హోల్ సేల్ షాపులున్నాయి. రాయచోటిలో దీప బ్లడ్ బ్యాంక్ ఒకటి అందుబాటులో ఉంది. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూర్ ప్రాంతాలలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోర్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మదనపల్లి ఔషధ తనిఖీ కార్యాలయాల పరిధిలో 620 మందుల షాపులున్నాయి. ఇందులో 494 రిటైల్,126 హోల్ సేల్ షాపులున్నాయి. బ్లడ్ బ్యాంకులు మదనపల్లె, పీలేరు ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి. పీలేరులో ప్రభుత్వ ఆసుపత్రిలోబ్లడ్ స్టోరేజ్ సెంటర్ అందుబాటులో ఉంది.
జిల్లాలో కేసులు ఏమైనా నమోదు చేశారా?
ప్రతి నెల 40 మందుల దుకాణాలను తగ్గకుండా తనిఖీ చేస్తున్నాం. తనిఖీలలో మందుల దుకాణాలకు లైసెన్సులు, నూతన దరఖాస్తులు, దుకాణాలు మార్పిడి, లైసెన్స్ కండిషన్, చట్ట పరిధిలో పనిచేస్తున్నయా లేదా అని పరిశీలిస్తున్నాం. ఎవరైనా మందుల నాణ్యత అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాయచోటి ప్రాంతంలో ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేశాం. మదనపల్లె పరిధిలో తొమ్మిది కేసులను నమోదు చేశాం. లైసెన్సు లేకుండా, మందలను అధిక ధరలకు కేసు నమోదు చేస్తాం. ప్రతినెల నాణ్యత ప్రమాణాలకు పరిశీలించడానికి మందుల దుకాణాల్లో శాంపిల్స్ సేకరించి పరిశీలనకు విజయవాడ ల్యాబరేటరికి పంపిస్తున్నాం.
సిబ్బంది కొరత ఏమైనా ఉందా?
సిబ్బంది కొరత ఉన్నది వాస్తవమే. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్న వారితో విధులను నిర్వహిస్తున్నాం. త్వరలోనే నూతన సిబ్బందిని నియామకానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలకు ఏమైనా సలహాలు ఇవ్వాలను కుంటున్నారా?
ఔషధలు అనేవి విషపూరితమైన పదార్థాలు వంటివి. కావున వాటిని అవసరమేరకు వైద్యులు సూచించిన మేరకు మాత్రమే కొనుగోలు చేయవలెను. స్వంత వైద్యం ప్రాణాంతకం. లైసెన్స్ కలిగిన మందుల దుకాణాల్లో మాత్రమే వైద్యులు సూచించిన మందులను కొనుగోలు చేయాలి. అనవసరంగా మందులను వాడరాదు. లైసెన్స్ లేని షాపుల్లో మందులు కొనరాదు. అ టువంటి షాపులు ఏవైనా ఉంటే మీ పరిధిలోని ఔషధ తనిఖీ కార్యాలయాలకు Dca-grams@ap.gov.in 08632330909 ఫిర్యాదు చేయాలి.