మండలంలో పలు పాఠశాలల్లో మేరా మట్టి మేరా దేశ్
మండలంలో పలు పాఠశాలల్లో
మేరా మట్టి మేరా దేశ్
ప్రజాశక్తి -సోమల: సోమల మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. కందూరు, తుగడం వారి పల్లి, తమ్మి నాయుని పల్లి, సోమల పాఠశాలల్లో విద్యార్థులు ప్రతిజ్ఞ నిర్వహించి అనంతరం మట్టిని సేకరించి మట్టి పాత్రలో ఉంచారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు భారత దేశ ఔన్నత్యం సంస్కతి సంప్రదాయాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులు జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.










